జయంతి మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ - nandamuri balakrishna pays tribute to jayanthi death
close
Published : 26/07/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జయంతి మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి జయంతి మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసి, ‘అభినయ శారద’గా పేరు తెచ్చుకున్న నటి జయంతి. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500లకు పైగా సినిమాలు చేశారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె మృతి పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం తెలియజేశారు.

‘‘జయంతి గారు గొప్ప నటి. అప్పటినుంచి ఇప్పటివరకూ అనేక తరాలతో కలిసి పని చేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి ‘జగదేకవీరుని కథ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత ‘కుల గౌరవం’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’వంటి అజరామరమైన చిత్రాల్లో ఆమె నటించారు. నేను హీరోగా నటించిన ‘అల్లరి క్రిష్ణయ్య’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘తల్లితండ్రులు’, ‘వంశానికొక్కడు’ చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రేక్షకులు అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ తెలిపారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని