హైదరాబాద్: మాస్ కమర్షియల్ సినిమాలే కాదు, పౌరాణిక, జానపద చిత్రాల్లోనూ నటించి మెప్పించగల నటుడు నందమూరి బాలకృష్ణ. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన పలు పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. అంతేకాదు, గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌లు చెప్పడంలోనూ బాలయ్యకు ఆయనే సాటి. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా అరుదైన చిత్రాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు.
తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్: కథానాయకుడు’, ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినీ జీవితంలో తన తండ్రి పోషించిన పాత్రలను ఈ చిత్రాల్లో బాలకృష్ణ పోషించారు. అలాంటి వాటిలో భీష్ముడి పాత్ర ఒకటి. మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్ముడి గెటప్‌లో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
‘‘భీష్మ పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం. నాన్నగారు ఆయన వయసుకు మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల నుంచి విశేష ఆదారాభిమానులు అందుకున్నారు. అందుకే ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో నేను భీష్ముడిగా కొన్ని సన్నివేశాలు తీశాం. అయితే, నిడివి కారణంగా వాటిని తొలగించాల్సి వచ్చింది. మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా పాత్రకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నా’’ -సోషల్ మీడియాలో బాలకృష్ణ
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బీబీ3’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. వేసవి కానుకగా మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
రెండోసారి.. పంథా మారి
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
- పవన్ భార్యగా సాయిపల్లవి!
గుసగుసలు
- సుదీప్తో సుజిత్?
- పవన్ భార్యగా సాయిపల్లవి!
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ప్రతి మనిషిలోనూ రైతు ఉన్నాడు: బుర్రా
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
నమ్మించి మోసం చేశారు: జయలలిత
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
కొత్త పాట గురూ
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’