ఓటీటీలో నయన్‌ చిత్రం - nayanathara starer netrikann release in ott
close
Published : 22/07/2021 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో నయన్‌ చిత్రం

చెన్నై: నయనతార ప్రధాన పాత్రలో నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘నెట్రికన్‌’. మిలింద్‌ రావ్‌ తెరకెక్కించారు. విఘ్నేష్‌ శివన్, థామస్‌ కిమ్, కె.ఎస్‌.మాయిల్వగనన్‌ సంయుక్తంగా నిర్మించారు. అజ్మల్‌ అమీర్, మణికందన్, శరన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నయన్‌ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. నయనతార అంధురాలిగా కనిపించనున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని