close
Published : 19/04/2021 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్‌: నజ్రియా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అంటే సుందరానికీ!’ చిత్రం తనకెంతో ప్రత్యేకమని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది నటి నజ్రియా. నాని కథానాయకుడిగా, వివేక్‌ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఈ సినిమాతోనే నేరుగా టాలీవుడ్‌కి పరిచయమవుతోందామె. ఈ నేపథ్యంలో అభిమానులతో తన మనసులో మాట పంచుకుంది. ‘‘అందరికీ నమస్కారం. నేను ఈ రోజు నా తొలి తెలుగు సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాను. మొదటిది ఎప్పుడూ ప్రత్యేకమే. ‘అంటే సుందరానికీ!’ చిత్రం నాకెంతో ప్రత్యేకం’’ అని అన్నారు.

‘రాజా రాణి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ మలయాళీ భామ. సంగీతం నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని