భయపెట్టే రెండో తరగతి పిల్లాడి కథ..! - needa trailer nizhal kunchacko boban nayanthara
close
Published : 20/07/2021 23:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భయపెట్టే రెండో తరగతి పిల్లాడి కథ..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథలు నిజమైతే.. అది కూడా రెండో తరగతి చదివే పిల్లాడు చెప్పిన కథలో సంఘటనలే నిజ జీవితంలోనూ ఎదురైతే..? ఇలాంటి ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘నీడ’. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, కుంచాకో బోబన్ ప్రధానపాత్రల్లో నటించారు. ‘నిలల్‌’ పేరుతో మలయాళంలో వచ్చిన దీని మాతృక ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్‌.భట్టతిరై దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో జులై 23 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కాగా.. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మీరూ ఓ లుక్కేయండి మరి.!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని