close
Published : 05/04/2021 18:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నితిన్‌తో హైబ్రీడ్‌ పిల్ల? 

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ సరసన హైబ్రీడ్‌ పిల్ల నటించనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇంతకీ హైబ్రీడ్‌ పిల్ల ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు యువ నాయిక సాయి పల్లవి. ‘భానుమతి ఒక్కటే పీస్‌.. హైబ్రీడ్‌ పిల్ల’ అంటూ యువతని ‘ఫిదా’ చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నితిన్‌ కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.

నూతన దర్శకుడు నితిన్‌- సాయి పల్లవి కలయికలో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథని అందించనున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సాయి పల్లవి నటించిన ‘లవ్‌ స్టోరీ’, ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ చిత్రాలతో అలరించిన నితిన్‌ ప్రస్తుతం ‘మాస్ట్రో’లో నటిస్తున్నాడు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని