close
Published : 23/02/2021 13:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అలా మొదలైంది’ గుర్తుకొస్తోంది!

హైదరాబాద్‌: స్నేహితులందరం కలిసి ఓ అందమైన సినిమా చేశాం అంటోంది నిత్యమేనన్‌. ఆమె అశోక్‌ సెల్వన్‌, రీతూవర్మతో కలిసి నటించిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. జీ ప్లెక్స్‌లో ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిత్య మేనన్‌ మాట్లాడుతూ ‘‘మా అందరికీ ఎంతో నచ్చిన చిత్రమిది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ‘అలా.. మొదలైంది’   గుర్తుకొస్తుంది. స్నేహితులైన నేను, నాని, నందిని కలిసి చేసిన సినిమా అది. అది ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ఇదీ అంతే మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటుంది’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమా చూస్తున్నంతసేపూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇంటిల్లిపాదికీ వినోదం పంచే ఓ మంచి   చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాజేశ్‌ మురుగేశన్‌, ఛాయాగ్రాహకుడు దివాకర్‌ మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని