ఆస్కార్ ‌2021: బరిలో నిలిచింది ఈ చిత్రాలే! - oscar nominations 2021 full list
close
Published : 16/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్కార్ ‌2021: బరిలో నిలిచింది ఈ చిత్రాలే!

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డు(ఆస్కార్‌)లకు పలు చిత్రాలు నామినేట్‌ అయ్యాయి. 93వ అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను ప్రియాంక చోప్రా, ఆమె భర్త గాయకుడు నిక్‌ జోన్స్‌ ప్రకటించారు. అత్యధికంగా నెట్‌ఫ్లిక్స్‌ ‘మ్యాంక్‌’ చిత్రం 10 విభాగాల్లో నామినేట్‌ అయింది. తొలిసారి ఇద్దరు మహిళా డైరెక్టర్లు క్లోవీ చావ్‌, ఎమరాల్డ్‌ ఫెన్నల్‌లు ఉత్తమ దర్శకుల కేటగిరీలో నామినేట్‌ అయ్యారు. అంతర్జాతీయ చిత్రాల కేటగిరీలో తమిళ చిత్రం ‘సూరారై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) ప్రదర్శితమైనా తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ప్రియాంక చోప్రా నటించిన ‘వైట్‌ టైగర్‌’కు అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది.

2021 ఆస్కార్‌కు నామినేట్‌ అయిన చిత్రాలు ఇవే

ఉత్తమ చిత్రం

ది ఫాదర్‌

జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య

మ్యాంక్‌

మినారి

నో మ్యాడ్‌ ల్యాండ్‌

ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌

సౌండ్‌ ఆఫ్ మెటల్‌

ది ట్రయల్‌ ఆఫ్‌ ది చికాగో 7


ఉత్తమ దర్శకుడు

 లీ ఐజాక్‌ చుంగ్‌(మినారి)

ఎమరాల్డ్‌ ఫెన్నల్‌ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)

డేవిడ్‌ ఫించర్‌(మ్యాంక్‌)

క్లోవీ చావ్‌(నోమ్యాడ్‌ ల్యాండ్‌)

థామస్‌ వింటర్‌ బెర్గ్‌(అనదర్‌ రౌండ్‌)


ఉత్తమ నటుడు

 రిజ్‌ అహ్మద్‌ (సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌)

చాడ్విక్‌ బోస్‌మెన్‌( మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఆంథోని హాప్కిన్స్‌(ద ఫాదర్‌)

గ్యారీ ఓల్డ్‌మెన్‌(మ్యాంక్‌)

స్టీవెన్‌ యెన్‌(మినారి)


ఉతమ నటి

 వయోలా డేవిస్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఆండ్రా డే (ది యునైటెడ్‌ స్టేట్స్‌ వర్సెస్‌ బైలీ హాలీడే)

వెనీస్సా కిర్బీ(పీసెస్‌ ఆఫ్‌ ఎ ఉమెన్‌)

ఫాన్సిస్‌ మెక్‌డోర్‌మ్యాండ్‌(నో మ్యాడ్‌ ల్యాండ్‌)

క్యారీ మల్లిగన్‌(ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)


ఉత్తమ సహాయ నటుడు:

సాచా బారన్‌ కొహెన్‌ (ది ట్రైల్‌ ఆఫ్‌ ది చికాగో 7)

డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మిస్సయా)

లెస్లీ ఓడోమ్‌ (ఒన్‌ నైట్‌ ఇన్‌ మియామి)

పాల్‌ రేసీ (సౌండ్‌ ఆఫ్‌ మెటల్)

లెకీత్‌ స్టాన్‌ఫీల్డ్‌ (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా)


ఉత్తమ సహాయ నటి:

గ్లెన్‌ క్లోజ్‌ (హిల్‌బిలీ ఎలిజీ)

ఒలివియా కోల్మాన్‌ (ది ఫాదర్)

అమాందా సేఫ్రీడ్‌(మాంక్‌)

యూ-జంగ్‌ యాన్‌ (మినారి) 


ఉత్తమ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లే:

జ్యూడస్‌  అండ్‌ ది బ్లాక్‌ మెసియ్య ( స్రీన్‌ ప్లే: విల్‌ బెసన్‌, శాకా కింగ్‌, కథ: విల్‌ బెర్సన్‌, శాకా కింగ్‌, కెన్నీ లూకస్‌‌, కీత్‌ లుకాస్‌)

మినారి (లీ ఐజక్‌ చూన్‌‌)

ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌ (ఎమరాల్డ్‌ ఫెన్నెల్‌)

సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌ ( స్ర్కీన్‌ప్లే: డారియస్‌ మార్డర్‌, అబ్రహాం మార్డర్‌, కథ: డారియస్‌ మార్డర్‌, డెరెక్‌ సియాన్‌ఫ్రాన్స్‌)

ది ట్రైల్‌ ఆఫ్‌ ది చికాగో 7 (ఆరన్‌ సాకిన్‌)


ఉత్తమ అడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే:

క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌ )

క్లోయి షావ్‌ (నోమాడ్లాండ్‌)

కెంప్‌ పవర్స్‌ (వన్‌ నైట్‌ ఇన్‌ మియామీ)

రామిన్‌ బారానీ (ది వైట్‌ టైగర్‌) 


ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

ఆన్‌వార్డ్‌ (డ్యాన్‌ స్కాలన్‌, కోరి రీ)

ఓవర్‌ ది మూన్‌ (గ్లెన్‌ కీన్‌, గెనీ రిమ్‌, పీలన్‌ )

ఎ షాన్‌ ది షీప్‌ మూవీ: ఫార్మగెడన్‌ (రిచర్డ్‌ ఫెలన్‌, విల్‌ బెచెర్‌, పాల్‌ క్యూలీ)

సోల్‌ (పీట్‌ డాక్టర్‌, దానా మరీ)

ఓల్ఫ్‌వాకర్స్‌ (టామ్‌ మూ, రాస్‌ స్టివర్ట్‌, పాల్‌ యంగ్‌, స్టీఫన్‌ రొనాల్ట్స్‌)


ఇంటర్నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:

అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)

బెటర్‌ డేస్‌ (హాంకాంగ్‌)

కలెక్టివ్‌ (రొమానియా)

ది మ్యాన్‌ హు సోల్డ్‌ హిజ్‌ స్కిన్‌ (తునీషియా)

కూ వ్యాడిస్‌, ఐడా? (బొస్నియా, హర్స్‌గోవిన)


డాక్యుమెంటరీ ఫీచర్‌:

కలెక్టివ్‌ (అలెగ్జాండర్‌ నానూ , బియాంక ఓన)

• క్రిప్‌ క్యాంప్‌ (నికోల్‌ న్యూనమ్‌, జిమ్‌ లెబ్రెక్ట్‌, సారా బోల్డర్‌)

ది మోల్‌ ఏజెంట్‌ (ఆబ్బర్డి, మాసెలా)

మై ఆక్టోపస్‌ టీచర్‌ (పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌)

టైమ్‌ (గ్యారెట్‌ బ్రాడ్లీ, లారెన్‌ డామినో, కెలెన్‌ క్విన్‌)


సినిమాటోగ్రఫీ:

జుడాస్‌ అండ్‌ ది బ్లాక్‌ మిస్సయా (సీన్‌ బాబిట్‌)

మ్యాంక్‌ (ఎరిక్‌)

న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ (డ్యారూస్‌ ఓల్‌స్కీ)

నోమడ్లాండ్‌ (జేమ్స్‌ రిచార్డ్స్‌)

ది ట్రైల్‌ ఆఫ్‌ ది చికాగో 7 (ఫెడన్‌ పాపమైఖేల్‌)


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని