close
Published : 18/02/2021 17:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎవడ్రా..నా లవర్‌ని ఏడిపించింది: ‘పాగల్‌’ టీజర్‌

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’,‘హిట్‌’ వంటి చిత్రాల విజయంతో జోరుమీదున్న విశ్వక్‌సేన్‌ ‘పాగల్‌’అంటూ వచ్చేస్తున్నాడు. తాజాగ ఆ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ లవర్‌ బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘ఎవడ్రా నా లవర్‌ని ఏడిపించింది..’అనే డైలాగ్‌ యూత్‌తో పాటు, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. దిల్‌ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్‌ లక్కీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. నరేష్‌ కొప్పిలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 30న థియేటర్లలో విడుదల కానుంది. మురళీశర్మ, రాహుల్‌రామకృష్ణ వంటి నటులు చిత్రంలో ఉన్నారు. మరి ‘పాగల్‌’ టీజర్‌ను వీక్షించండి!

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని