అప్పట్లో అడవి రాముడు.. ఇప్పుడు జాతి రత్నాలు - paruchuri gopala krishna talks about naveen polishetty
close
Published : 03/05/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పట్లో అడవి రాముడు.. ఇప్పుడు జాతి రత్నాలు

హాస్యమే ఈ చిత్రానికి బలం: పరుచూరి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ‘జాతి రత్నాలు’ సినిమా గురించి చాలామంది ఏం మాట్లాడుకుంటున్నారో.. అప్పట్లో ‘అడవి రాముడు’ గురించి కూడా ఇలాగే ఆశ్చర్యంగా చర్చించుకున్నారని ప్రముఖ రచయిత గోపాలకృష్ణ తెలిపారు. ‘పరుచూరి పలుకులు’లో  భాగంగా ‘జాతిరత్నాలు’ సినిమాపై ఆయన తన విశ్లేషణ పంచుకున్నారు, ‘అందని ఆకాశం కోసం అర్రులు చాచే కంటే.. అందిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం మంచిది.. ఇదే జాతిరత్నాలు చెప్పిన నీతి’ అని ఆయన అన్నారు.

‘‘ఈ సినిమా ఎందుకు ఆడిందో తెలియదని చాలామంది నాతో అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌ గారి చిత్రం ‘అడవి రాముడు’ థియేటర్లలో హౌస్‌ఫుల్‌ బోర్డులతో ఆడుతున్న సమయంలో.. ‘ఈ సినిమాలో ఏముందని ఇంతలా ఆడుతోందని’ చాలామంది అన్నారు. ఆ సినిమాలో ఏముందో ఈ జాతిరత్నాలు చిత్రంలోనూ అదే ఉంది. అదే ‘ఎంటర్‌టైన్మెంట్‌’. అక్కడ జంధ్యాల గారు.. రాఘవేంద్రరావు గారు.. అన్నగారు(ఎన్టీఆర్‌) ఆ సినిమాను కాపాడితే.. ఇక్కడ అనుదీప్‌, నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌, ప్రియదర్శి, ఫరియా.. ఈ నలుగురూ సినిమాకు నాలుగు స్తంభాల్లా పనిచేశారు. తన కలను నెరవేర్చుకోవడంతో పాటు తండ్రి కోరికను తీర్చిన.. తండ్రి కొడుకుల కథే ఈ సినిమా. హాస్యమే ఈ సినిమా బలం. ఆ హాస్యాన్ని అనుక్షణం పండించుకుంటూ రావడం వల్లే చిత్రం ఇంత పెద్ద హిట్‌ అయింది. అల్లరి నరేశ్‌లాంటి వాళ్లు చేయాల్సిన సినిమా ఇది.. కానీ.. ముగ్గురు కలిసి బాగా నవ్వులు పండించారు. ఈ సినిమాలో నవ్వించకుండా ఉండే పాత్ర ఏదైనా ఉందంటే అది శుభలేఖ సుధాకర్‌ పాత్ర ఒక్కటే. తన తండ్రి పెట్టిన సంస్థను ఎంత కష్టం వచ్చినా అమ్ముకోవద్దనే సిద్ధాంతం ఆయనది. ఇక సినిమాను ఎవరి అంచనాలకు అందకుండా తెరకెక్కించారు’ అని పరుచూరి అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని