ఆయన అడుగు.. రాసిన పుస్తకం ఒక శతాబ్దం మాట్లాడుకుంటూనే ఉంది: త్రివిక్రమ్‌ - pawan kalyan and trivikram release srisri book
close
Updated : 18/09/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన అడుగు.. రాసిన పుస్తకం ఒక శతాబ్దం మాట్లాడుకుంటూనే ఉంది: త్రివిక్రమ్‌

హైదరాబాద్‌: మహాకవి శ్రీశ్రీ ఒక శిఖరంలాంటి వారని ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ అన్నారు. శ్రీశ్రీ ముందు తనలాంటి వాళ్లందరూ గులకరాళ్లంటూ వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ‘భీమ్లా నాయక్’ సెట్‌లో పవన్ కల్యాణ్.. త్రివిక్రమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారిద్దరురూ శ్రీశ్రీ కవితలను, సాహిత్యాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు.

పవన్, త్రివిక్రమ్ సినిమా మిత్రులుగానే కాకుండా సాహిత్య మిత్రులు కూడా కావడంతో తరుచూ పలువురు సాహితీవేత్తలు, వాళ్ల రచనలను గుర్తుచేసుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ క్రమంలో శ్రీశ్రీ మహాప్రస్థానంపై ఆయన స్వరచనలో, ఛాయా చిత్రాలతో కూడిన పుస్తకాన్ని పవన్ త్రివిక్రమ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఒక కవి మరో కవి గురించి చెబుతుంటే వచ్చే సొబగు బాగుందని పవన్ కల్యాణ్ అనడంతో నవ్వులు పూశాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని