PSPK28: గుర్తు పెట్టుకోండి.. మేమే చెబుతాం! - pawan kalyan harish shankar movie update
close
Published : 09/06/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PSPK28: గుర్తు పెట్టుకోండి.. మేమే చెబుతాం!

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అభిమాని తయారు చేసిన ఫొటోతో పాటు, పలు వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘పవన్‌కల్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన ఈ ఏడాది ఉగాది రోజున ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ విడుదల చేయాలని భావించాం. అయితే, కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశాం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తాం’’ -ట్విటర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ వరుస సినిమాలతో జోరు మీదున్నారు. ఇప్పటికే ‘అప్పయనుమ్‌ కొషియుమ్‌’ రీమేక్‌, ‘హరి హర వీరమల్లు’ చిత్రాల షూటింగ్‌ మొదలైంది. కరోనా కారణంగా వాటి చిత్రీకరణ వాయిదా పడింది. ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన వెంటనే పవన్‌ రంగంలోకి దిగనున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని