అప్డేట్ షేర్ చేసిన చిత్ర బృందాలు
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తమ తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించేశారు. ఈ మేరకు వీరి కొత్త సినిమాల షూటింగ్స్ సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయా చిత్రబృందాలు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టాయి.
హైదరాబాద్‌లో పవన్..
పవన్‌కల్యాణ్-రానా ప్రధాన పాత్రల్లో మలయాళీ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో పవన్‌కల్యాణ్ పాల్గొంటున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందించనున్నారు.
దుబాయ్‌లో మహేశ్..
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్ నటించనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. దీని చిత్రీకరణ సోమవారం దుబాయ్‌లో ప్రారంభమైంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూట్ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్ వేదికగా ఓ ప్రత్యేక వీడియోని అభిమానులతో పంచుకున్నారు.
ఇవీ చదవండి!
చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు
మరిన్ని
గుసగుసలు
- మూడో చిత్రం ఖరారైందా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
- మోహన్‌బాబు సరసన మీనా!
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- పవన్-మహేశ్ పోటీ పడనున్నారా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా