‘వకీల్‌సాబ్‌’ పవన్‌పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి - pawan kalyan wraps up on vakeel saab shooting
close
Updated : 29/12/2020 22:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’ పవన్‌పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

హైదరాబాద్: అగ్రకథానాయకుడు పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఇందులోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ‘‘పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ జరుగుతుంది. పోలీసుల షీల్డ్స్‌ మీద స్టూడెంట్స్ కొడతారు. పోలీస్ అనే లెటర్ మీద కొట్టడం ఇష్టం లేక పవన్‌ ఆ స్టిక్కర్స్‌ని తొలగించారు. పోలీస్‌ శాఖ మీద ఉన్న గౌరవంతోనే స్టిక్కర్స్ తీసేయాలని నిర్ణయించారు’’ ఈ ఫొటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్, శృతి హాసన్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా.. మగువా’ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

 మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని