నటి హిమజకు పవన్‌ లేఖ - pawankalyan sends appreciation letter to himaja
close
Updated : 01/03/2021 11:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నటి హిమజకు పవన్‌ లేఖ

పహిల్వాన్లను సత్కరించిన పవర్‌స్టార్‌

హైదరాబాద్‌: చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తోటి కళాకారులను సత్కరించడంలో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముందుంటారు. తాజాగా ఆయన నటి హిమజకు అభినందనలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించిన హిమజ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్‌ - క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఆ సినిమా షూట్‌లో సైతం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

కాగా, తాజాగా హిమజ సోషల్‌మీడియా వేదికగా ఓ విషయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నటి హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొంటూ పవన్‌ పంపించిన లేఖను షేర్‌ చేస్తూ.. తన ఆనందాన్ని మాటల్లో లేదా ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నానని హిమజ తెలిపారు. మరోవైపు తమ సినిమాలో పనిచేసిన పహిల్వాన్లను తాజాగా పవన్‌కల్యాణ్‌ సత్కరించారు.

పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్‌లో పవన్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని