‘రాధేశ్యామ్‌’లో పూజా పాత్ర అదేనా? - pooja to appear as medico in radheshyam
close
Updated : 17/04/2021 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రాధేశ్యామ్‌’లో పూజా పాత్ర అదేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఇందులో పూజాహెగ్డే  ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇందులో మెడికోగా కనిపించనుందని వార్తలొస్తున్నాయి. కథలో ప్రభాస్‌ ఓ ప్రమాదంలో చిక్కుకుని ఆసుపత్రిలో చేరతాడట. అక్కడే ప్రేరణ (పూజా) మెడికోగా పని చేస్తుంటుందట. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ ప్రయాణం మొదలవుతోందనే వార్త వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ విడుదలై చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

యువీ క్రియేషన్స్, టీ-సీరీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తుండగా, కృష్ణంరాజు, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్‌ కపూర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా జులై 30న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం పూజా తెలుగులో అఖిల్‌తో కలిసి ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న ‘ఆచార్య’లో నీలాంబరిగా నటిస్తోంది. హిందీలో ‘సర్కస్‌’, తమిళంలో విజయ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని