ఈసారి డేట్స్‌తో సహా చెప్పేశారు
హైదరాబాద్: పాన్ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులకు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలో ప్రభాస్ హీరోగా తాను తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించి రెండు అప్డేట్లను ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రానున్నట్లు గతేడాది చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కథానాయికగా నటించనున్నారు. అలాగే బాలీవుడ్ అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
కాగా, సంక్రాంతి పండుగ తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన అప్డేట్ ఇస్తానని దర్శకుడు నాగ్అశ్విన్ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ జరిగి పదిరోజులు కావొస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్ అశ్విన్.. ‘జనవరి 29న ఒకటి, ఫిబ్రవరి 26న మరొకటి.. కచ్చితంగా అప్డేట్లు ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నారు. దీనితోపాటు ఆయన.. ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్’ చేయనున్నారు.
ఇదీ చదవండి
ప్రభాస్.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు
మరిన్ని
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ