close
గుస‌గుస‌లు
ప్రభాస్‌కు విలన్‌ ఆయనేనా?

హైదరాబాద్‌: ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ప్రభాస్‌ 20వ చిత్రంగా ఇది రూపొందుతోంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన సెట్స్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా  జగపతిబాబు నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

తొలుత ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే పేరు పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పేరు మారనుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ‘ఓ డియర్‌’ అనే పేరు పెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. ‘రాధే శ్యామ్‌’ అనే మరో పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అలనాటి బాలీవుడ్‌ అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.