ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
ఇంటి ఎంపికలో హీరో టీమ్ బిజీ
హైదరాబాద్: వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు పాన్ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ‘సలార్’తో బిజీగా ఉన్న ఆయన త్వరలో మరో పాన్ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’ షూట్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకూ ప్రభాస్ ఎక్కువ శాతం ముంబయిలోనే గడపనున్నారు. అక్కడ ఉన్నన్ని రోజులు హోటల్లో కాకుండా ఫ్లాట్‌లో ఉండాలని ప్రభాస్ భావిస్తున్నారట. దీంతో తన అభిరుచులకు తగ్గట్టుగా ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారట. ఈ మేరకు ఆయన బృందం ఇల్లు ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక సైతం ముంబయికి మకాం మార్చినట్లు ఇటీవల నెట్టింట్లో పోస్టులు దర్శనమిచ్చాయి.
ఇక ‘ఆదిపురుష్’ విషయానికి వస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. సీతగా కృతిసనన్ సందడి చేయనున్నట్లు సమాచారం. ఇక రామాయణంలో ముఖ్యమైన రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ‘ఆదిపురుష్’ రోజువారీ షూట్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుండడంతో వీఎఫ్ఎక్స్, స్టైలింగ్, కాస్ట్యూమ్స్ పనుల్లో ప్రస్తుతం చిత్రబృందం పూర్తిగా నిమగ్నమైంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్