close
Published : 04/04/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘మాస్టర్‌’ దర్శకుడితో ప్రభాస్‌ చిత్రం!

ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయా? - అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. ‘ఖైదీ’, ‘మాస్టర్‌’ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. ఆయన ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తోనే చేయనున్నారని, అందుకోసం కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌తో సినిమా చేస్తారు. ఈ మూడు సినిమాల తర్వాత ప్రభాస్‌ - లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలిసింది. ప్రభాస్‌ ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని సినీ పరిశ్రమల నుంచి దర్శకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని