close
Published : 04/04/2021 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కవల నాయికలతో ఆటపాట?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు దర్శకుడిగా.. మరోవైపు నటుడిగా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో ‘రాధే’ చిత్రం తెరకెక్కిస్తున్న ఆయన.. ‘బగీరా’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి.

ఇప్పుడాయన కథానాయకుడిగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారని  సమాచారం. ఎస్‌.కల్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనుంది. ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో.. కథానాయికలుగా ఇద్దరు కవల సోదరీమణులు కనిపించనున్నారట. ఇప్పుడీ పాత్రల కోసమే అలాంటి కవలల్ని వెతికి పట్టుకునే పనిలో పడింది చిత్ర బృందం. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని