వాళ్లిద్దరే నా దేవుళ్లు అంటోన్న నటుడు
హైదరాబాద్: బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు నటుడు ప్రదీప్. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న కుటుంబ, ప్రేమకథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృతా అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహించారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా జనవరి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకకు అనిల్‌రావిపూడి, మారుతి, అడివి శేష్, కార్తికేయ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ ఈవెంట్లో ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘ఎన్నో వేడుకల్లో వ్యాఖ్యాతగా నేను స్టేజ్‌పై నిల్చొని హీరోహీరోయిన్లను వేదికపైకి ఆహ్వానిస్తూ ఉండేవాడిని. కానీ మొదటిసారి.. హీరో ప్రదీప్ అని నన్ను స్టేజ్ మీదకు ఆహ్వానించగానే నాకెంతో భయంగా అనిపించింది. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన.. నాకెంతో అండగా నిలిచిన ప్రేక్షకులందరికీ పాదాభివందనం. నన్నూ మీ ఇంటిలో ఒకడిగా భావించి మీరు చూపించిన ప్రేమాభిమానాల వల్లే ఈ ప్రయాణం నాకెంతో సులువుగా సాగింది. ఈ సినిమాతో హీరోగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి మున్నా నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు. రియల్‌లైఫ్‌లో నాకు అన్నయ్య లేరు. కానీ ఇకపై నాకు ఆయన రూపంలో ఓ అన్నయ్య ఉన్నారు. మున్నా అన్న అసలు పేరు కూడా ప్రదీపే. మేమిద్దరం కలిసి మరెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ బంధం 30 ఏళ్లపాటు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. మధురానగర్, వెంగళ్రావునగర్ రోడ్లపై సైకిల్ తొక్కుకుంటూ.. థియేటర్ల ముందు నిల్చొని సినిమా పోస్టర్లు చూసే ఓ మిడిల్‌క్లాస్ అబ్బాయ్.. ఈరోజు అదే థియేటర్లో తన సినిమా చూసేంతవరకూ తీసుకువచ్చిన ఇద్దరు దేవుళ్లు.. మా అమ్మా నాన్న. ఇప్పటివరకూ నేను ఏ షో చేసినా, ఏ సినిమా చేసినా వాళ్లు ఎక్కడికీ రాలేదు. మొదటిసారి ఈ ఫంక్షన్‌కు వచ్చారు. వాళ్లిద్దరికీ థ్యాంక్యూ. వాళ్లు నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. జనవరి 29న అందరం థియేటర్లలో కలుద్దాం’’ అని అన్నారు.
ఇదీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!