Cinema news: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సిద్ధమైందా? - prashanth neel new movie in telugu with ramcharan
close
Published : 16/10/2021 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema news: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సిద్ధమైందా?

హైదరాబాద్‌: మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చేశాయి. ఉదయం రామ్‌చరణ్-గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను ప్రకటించగా, మధ్యాహ్నం మరో క్రేజీ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. ‘కె.జి.యఫ్‌’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమా రెండో భాగం కూడా పూర్తయింది. ఇక ప్రభాస్‌ కథానాయకుడిగా ‘సలార్‌’ ఇప్పటికే సెట్స్‌పైన ఉంది. కాగా, ప్రశాంత్‌ నీల్‌ తెలుగులోనే మరో చిత్రం చేయనున్నారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దసరాను పురస్కరించుకుని చిరంజీవి, రామ్‌చరణ్‌లను ప్రశాంత్‌ నీల్‌ కలిశారు. వారి కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవిని కలవడంతో తన చిన్ననాటి కల తీరిందని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ప్రశాంత్‌ చెప్పిన కథ నచ్చడంతో రామ్‌చరణ్‌ ఓకే చెప్పారని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో ప్రశాంత్‌నీల్‌ది అందెవేసిన చేయి. ఆ టేకింగ్‌ ఎలా ఉంటుందో ‘కె.జి.యఫ్‌’లో చూశాం. మరి మెగా అభిమానులు ఊహించని స్థాయిలో ప్రశాంత్‌నీల్ కథా, కథానాలను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరి సినిమా చేయనున్నారు. ఆ తర్వాతే ప్రశాంత్‌-చెర్రీల సినిమా పట్టాలెక్కుతుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని