‘పెళ్లిసందD’ మొదలైంది - premanteenti the first lyrical song announcement from pellisandad
close
Published : 27/04/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెళ్లిసందD’ మొదలైంది

హైదరాబాద్‌: పాతికేళ్ల కిందట కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘పెళ్లిసందడి’. శ్రీకాంత్‌ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఆ చిత్రం పేరుని మరోసారి  తలపిస్తూ ఇప్పుడు ‘పెళ్లిసంద...D’ తెరకెక్కుతోంది. ఇందులో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని పాటని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా లిరికల్‌ వీడియో ప్రకటనకు సంబంధించిన చిన్న వీడియోను పంచుకుంది.

ఏప్రిల్‌ 28కి ఓ ప్రత్యేకత ఉంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘అడవిరాముడు’ విడుదలైన రోజు. ఆయన సమర్పణలో రూపొందిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదలైందీ అదే రోజే. అందుకే ‘పెళ్లిసంద...దీ’ పాటని ఆ రోజున విడుదల చేయాలని నిర్ణయించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.  ‘‘ఇది కొత్త కథతో తెరకెక్కుతున్న చిత్రం. నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ నెల 28న విడుదల కానున్న పాటతో కె.రాఘవేంద్రరావు - కీరవాణి స్వరాల సందడి మళ్లీ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్‌.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని