మోహన్‌లాల్‌.. ‘బ్రోడాడీ’ - prithiviraj sukumaran to direct mohanlal in bro daddy
close
Published : 20/06/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోహన్‌లాల్‌.. ‘బ్రోడాడీ’

తిరువనంతపురం: కథానాయకుడిగా.. సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో విలక్షణమైన పాత్రలతో అలరించారు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌. ఆయన ‘లూసీఫర్‌’ చిత్రంతో  దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. మోహన్‌లాల్‌ కథా   నాయకుడిగా నటించిన ఈ సినిమా.. మలయాళంలో ఘన విజయాన్ని అందుకుంది. పృథ్వీ ఇప్పుడు తన దర్శకత్వంలో మోహన్‌లాల్‌తో మరో చిత్రం పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ‘బ్రోడాడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు పృథ్వీరాజ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ‘‘నా దర్శకత్వం నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆహ్లాదకరమైన కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ కథ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అతి త్వరలో  చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని