ప్రతీ ఆత్మ కొన్ని రహస్యాలను వదిలి వెళ్తుంది! - prithviraj cold case official teaser
close
Published : 20/06/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతీ ఆత్మ కొన్ని రహస్యాలను వదిలి వెళ్తుంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: వైవిధ్య కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది మలయాళ చిత్ర పరిశ్రమ. అక్కడ విజయవంతమైన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అవుతున్నాయి. ఇంకొన్ని చిత్రాలు రీమేక్‌ అవుతున్నాయి. నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘కోల్డ్‌ కేస్‌’. తను బాలక్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 30న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

‘ఈ భూమిని వదిలి వెళ్లే ప్రతీ ఆత్మ.. కొన్ని రహస్యాలను వదిలి వెళ్తుంది. అవి వెలుగులోకి వచ్చినప్పుడు బతికి ఉన్న వాళ్లకు మనలాంటి వ్యక్తుల సహాయం అవసరం’ అంటూ మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పృథ్వీరాజ్‌ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించాడు. మరి ఆత్మలు వదిలి వెళ్లిన ఆ రహస్యం ఏంటి? ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని