close
Published : 25/01/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పూరీ ‘జనగణమన’లో పవన్‌?

హైదరాబాద్‌: సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ డ్రీమ్‌ ప్రాజెక్టులలో ‘జనగణమన’ చిత్రం ఒకటి.  దీని గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఆయన ఒకింత ఉద్వేగంగానే మాట్లాడేవారు. మరి అలాంటి క్రేజీ ప్రాజెక్టులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ భాగం కాబోతున్నారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. స్టోరీ లైన్‌ విన్న పవన్‌ పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని పూరీకి చెప్పినట్టు వినికిడి.  ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బద్రి’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ బాక్సాఫీసు హిట్లుగా నిలిచాయి. ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ చిత్రం పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ పవన్‌తో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కనుక పూరీ చేస్తే  అంచనాలు భారీగానే ఉంటాయి. 

అంతకుముందు పూరీ ‘జనగణమన’ స్క్రిప్ట్‌ను మహేశ్‌బాబుతో చేద్దాం అనుకున్నారు. కానీ ఎందుకో రూపుదాల్చలేదు. అయితే ఆ స్క్రిప్ట్‌ను ఎప్పటికైనా తెరకెక్కిస్తానంటూ పూరీ పదే పదే చెప్పేవారు. ఒక వేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌తో పాటు బాక్సాఫీసుకు పండగే! ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’చిత్రీకరణ పూర్తై విడుదలకు రెడీ అవుతోంది. మరో పక్క రానాతో కలిసి మలయాళీ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’తెలుగు రీమేక్‌ పనిలో ఉన్నారు. అలాగే పూరీ విజయ్‌దేవరకొండతో ‘లైగర్‌’ అంటూ పాన్‌ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి!

30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు

ఆర్‌ఆర్‌ఆర్‌: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని