‘తగ్గేదే లే’ అంటున్న ‘పుష్ప’రాజ్
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ బన్ని అభిమానులకు శుభవార్త. అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ టీజర్ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో బన్ని హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బన్ని పుష్పరాజ్‌గా ఊరమాస్ లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన ఆసక్తిరేకెత్తించిన చిత్రబృందం తాజాగా టీజర్ విడుదల చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో బన్ని మాస్ పాత్రల్లో అలరించినప్పటికీ ఈ సినిమాలో మాస్కు మించి ఊరమాస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
బన్ని-సుకుమార్ కలయికలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక ఆడిపాడనుంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనుండటం మరో ప్రత్యేకత. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్