Pushpa Raj: ఆల్‌టైమ్‌ రికార్డు - pushparaj created a record
close
Published : 27/04/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Pushpa Raj: ఆల్‌టైమ్‌ రికార్డు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఏప్రిల్‌ 7న బన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియో పంచుకుంది చిత్ర బృందం. ‘ఇంట్రడ్యూసింగ్‌ పుష్పరాజ్‌’ పేరిట విడుదలైన ఈ వీడియో తాజాగా రికార్డు సృష్టించింది. అనతికాలంలో (తెలుగు పరిశ్రమకు సంబంధించి) 50 మిలియన్‌ వీక్షణలు సొంతం చేసుకున్న వీడియోగా నిలిచింది. ఇందులో ‘తగ్గేదే లే’ అంటూ బన్ని చెప్పిన డైలాగు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నితో సుకుమార్ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని