close
ఇంటర్వ్యూ
విజయ్‌ కొంత గ్యాప్‌ తీసుకుంటాడేమో..

‘నా అభిమానులు తప్పకుండా హ్యాపీ ఫీల్‌ అవుతారు’ : రాశీఖన్నా

హైదరాబాద్‌: ‘ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్లూ తెచ్చింది’.. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని ఈ పాటను వింటే వెంటనే గుర్తుకువచ్చేది నటి రాశీఖన్నా. బబ్లీ, బబ్లీగా కనిపించి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు ఈ నటి. ఆ తర్వాత ఆమె ఎన్నో ప్రేమ, కుటుంబ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది తాజాగా కొత్త ఏడాదిలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నా విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివే..

యామిని.. ఒక ఛాలెంజ్‌.. 

ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలతో పోలిస్తే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో పోషించిన యామిని పాత్ర విభిన్నంగా ఉంటుంది. యామిని పాత్ర ఎమోషనల్‌గా ఒక ఛాలెంజ్‌తో కూడుకున్నది. నేను ఇప్పటివరకూ చేసిన పాత్రల కంటే ఈ పాత్రను చాలా ఫీల్‌ అయ్యి చేశాను. ఒకవేళ నేను రిలేషన్‌లో ఉంటే ఎలా ఉంటాను. పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాను అనే విషయాలను అనునయించుకుని ఈ పాత్రను పోషించాను. ఈ టీజర్‌ చూసి అభిమానులు నా పాత్ర గురించి బాధపడ్డారు. కానీ సినిమా చూశాక తప్పకుండా వాళ్లు హ్యాపీ ఫీలవుతారు.

తప్పకుండా సర్‌ప్రైజ్‌..

ఈ సినిమా టీజర్‌ చూశాక చాలామంది ఇది ‘అర్జున్‌రెడ్డి2’ లా ఉందంటూ కామెంట్లు చేశారు. కానీ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చూశాక.. ప్రతి ఒక్కరూ ఈ కథ గురించి ఒకరకమైన ఆలోచనకు వచ్చారు. నేను చెప్పేది ఒక్కటే.. ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది. తప్పకుండా ఒక సర్‌ప్రైజ్‌ ఉంటుంది. ఆ సర్‌ప్రైజ్‌తోనే సినిమా పూర్తవుతుంది. 

దర్శకుడు, హీరో భయపడ్డారు..

ఈ సినిమాలో యామిని క్యారెక్టర్‌కు నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. చాలా సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఏడ్చేసేదాన్ని. నేను అలా ఏడవడం చూసి.. మా డైరెక్టర్‌ క్రాంతిమాధవ్‌తోపాటు హీరో విజయ్‌ భయపడ్డారు. యామిని పాత్రను ఫీల్‌ అయ్యి చేయడం వల్లే కన్నీళ్లు వచ్చాయి అనుకుంటున్నాను. పాత్రకు కనెక్ట్‌ అవ్వడం వల్లనే డబ్బింగ్‌ కూడా రెండు రోజుల్లోనే చెప్పేశాను. డబ్బింగ్‌కు వెళ్తున్నప్పుడు.. చెప్పగలనా? లేదా? అనిపించింది. కానీ బాగా చెప్పగలిగాను.

విజయ్‌తో చేయడం..

విజయ్‌ చాలా మంచి వ్యక్తి. అతనితో కలిసి పనిచేయడం బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేశాను. ఏ పాత్రనైనా తను ఫీల్‌ అయ్యి చేస్తాడు. ఇటీవల విజయ్‌.. ఇదే తన చివరి లవ్‌ స్టోరీ అని ప్రకటించాడు. నాకు తెలిసినంత వరకూ తనకి మహిళా అభిమానులు ఎక్కువ. వాళ్లందరూ విజయ్‌ని ప్రేమకథా చిత్రాల్లోనే చూడడానికి ఇష్టపడుతుంటారు. అభిమానుల ఇష్టాన్ని దృష్టిలో ఉంచుకుని.. కొంతకాలం గ్యాప్‌ తీసుకుని మళ్లీ ప్రేమకథా చిత్రాల్లో విజయ్‌ నటిస్తాడని భావిస్తున్నాను.  

 

ఆయన నుంచి చాలా నేర్చుకున్నా..

క్రాంతిమాధవ్‌ చాలా మంచి రైటర్‌. గుడ్‌ పర్సన్‌ ఈ సినిమాలోని ప్రతి పాత్రను చాలా చక్కగా రచించారు. జీవితం అంటే ఏమిటనే విషయాన్ని ఆయన నుంచి తెలుసుకున్నాను.

ఐశ్వర్య రాజేశ్‌ పాత్ర చేస్తా..

ఒకవేళ నేను ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో యామిని పాత్రను కాకుండా వేరే పాత్రను ఎంచుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఐశ్వర్యరాజేశ్‌ పోషించిన పాత్రను ఎంచుకుంటాను. ఎందుకంటే ఐశ్వర్య పాత్ర చాలా బాగుంటుంది. అలాగే తను అద్భుతంగా ఉంటుంది.



Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.