ఆ పరిశ్రమ నన్ను బ్యాన్‌ చేసింది..! - radha ravi and vairamuthu have banned me from working says chinmayi
close
Published : 13/03/2021 10:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పరిశ్రమ నన్ను బ్యాన్‌ చేసింది..!

ప్రముఖ గాయని చిన్మయి

చెన్నై: ‘మీటూ’ ఆరోపణలు చేసినందుకు కోలీవుడ్‌ ఇండస్ట్రీ తనని నిషేధించిందని ప్రముఖ గాయని చిన్మయి అన్నారు. అయితే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా సరే అర్థం చేసుకుని వెన్నంటే ఉండే రాహుల్‌ లాంటి భర్త దొరకడం తన అదృష్టమని ఆమె తెలిపారు. తన పాటలు, మాటలతో దక్షిణాది పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి తాజాగా ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌’లో ముచ్చటించారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు.

‘‘మీటూ’ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లను బయట పెట్టినందుకు 2018 అక్టోబర్‌ నుంచి రాధారవి, వైరముత్తు.. కోలీవుడ్‌ పరిశ్రమలో నన్ను బ్యాన్‌ చేశారు. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. నేను దీనిపై చట్టబద్ధంగా పోరాడుతున్నాను. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని‌ చేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే మంచి భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం. మరి, అండగా నిలిచే కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏమిటి?’’ అని చిన్మయి ప్రశ్నించారు. ప్రముఖ సింగర్‌ కార్తిక్‌, వైరముత్తులు తనని మానసిక  వేధింపులకు గురి చేశారని 2018లో చిన్మయి చేసిన ఆరోపణలు అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ‘మీటూ’లో భాగంగా సోషల్‌మీడియా వేదికగా ఆమె చేసిన ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని