close
Published : 04/03/2021 19:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్‌

తెరపై తన ఎనర్జిటిక్‌ నటనతో ప్రేక్షకులను ఉత్సాహపరిచి, తనదైన శైలిలో పంచులు పేలుస్తూ యూత్‌కు రాజ్‌తరుణ్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక ప్రత్యేక జోనర్‌ ఎంచుకుని ‘పవర్‌ ప్లే’తో మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీవితాలతో ఆడుకునే కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాలను రాజ్‌తరుణ్‌ ఇంటర్వ్యూలో వివరించారు. మరి ఆ కథేంటో చూద్దామా!

ఇప్పటివరకు టచ్‌ చేయని జోనర్‌ ఇది..

లాక్‌డౌన్‌ తర్వాత మా టీమ్‌ అంతా కలిసి చేయబోయే సినిమా ఎలా ఉంటే బాగుంటుందని చర్చించుకున్నాం. నాలుగైదు లైన్స్‌ అనుకుంటే ‘పవర్ ప్లే’ స్టోరీ లైన్‌ బాగా నచ్చింది. వెంటనే మిగతా పని మొదలుపెట్టాం. నేనూ, డైరెక్టర్‌ విజయకుమార్‌, కెమెరామెన్‌ సహా చిత్రంలోని మిగతా నటులెవ్వరం ఈ జోనర్‌ ఇప్పటివరకూ టచ్‌ చేయలేదు. మా టీమ్‌ చేసిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ బాగా నవ్విస్తే, ఈ ‘పవర్‌ప్లే’ ప్రేక్షకులను కచ్చితంగా ఉత్కంఠకు గురి చేస్తుంది.

హిట్టు, ఫట్టు మన చేతిలో ఉండవు..

చేయబోయే ప్రతి చిత్రం హిట్టువుతుందనే ఉద్దేశంతోనే చేస్తాం. కానీ, జయాపజయాలు మన చేతిలో ఉండవు. అయితే చేసిన తప్పులు మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకుంటాం. కొత్త తప్పులు చేసి మళ్లీ నేర్చుకుంటుంటాం.

సామాన్యుడుపై ‘పవర్‌ ప్లే’

పవర్‌ ప్లే అనేది క్రికెట్‌కు సంబంధించిన పదం. అయితే ఈ చిత్రంలో ఒక సామాన్యుడు చేయని తప్పుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనే కోణంలో కథ సాగుతుంది. కచ్చితంగా ఆడియన్స్‌ సీటు ఎడ్జ్‌లో కూర్చుని తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠతో సినిమా చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాలతో ఆడుకునే కథ.

ఇమేజ్‌ గురించి పట్టించుకోను..

అంతకు ముందు ప్రేమకథా చిత్రాలు చేశాను. అందువల్ల లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉండొచ్చేమో. కానీ, ఈ సినిమా కథ నచ్చడంతో ఇలాంటి థ్రిల్లర్‌ను ఎంచుకున్నా. ఇమేజ్‌ మార్చుకోవాలనే ఉద్దేశంతో కాదు.

వాళ్లతో సౌకర్యంగా ఉంటుంది కాబట్టే..

చేసిన దర్శకుడితోనే మళ్లీ సినిమాలు చేయడం ప్రత్యేక ఉద్దేశమేమీ లేదు. విజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌ గవిరెడ్డి, విరించి సినిమాలు చేస్తుంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. పరస్పర అవగాహన ఉంటుంది. పని బాగా జరుగుతుంది అంతే.

థియేటర్లో రిలీజ్‌ అయితే బాగుండేదేమో..

ఇంతకు ముందు మా కాంబోలో వచ్చిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రం థియేటర్లో చూసుంటే ప్రేక్షకులు మరింత ఎంజాయ్‌ చేసేవాళ్లు. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు థియేటర్లోనే బాగుంటాయి. కానీ, ప్రపంచం మొత్తం కరోనా కష్టకాలంలో ఉంది. దాంతో పోల్చుకుంటే మాకేం బాధనిపించలేదు. అయితే ‘పవర్‌ ప్లే’ మాత్రం కచ్చితంగా థియేటర్లో చూస్తేనే ఆ థ్రిల్‌ ఉంటుంది.

ఆమె ఛాయిస్‌ డైరెక్టర్‌ విజయ్‌దే..

హీరోయిన్‌ హేమల్‌ అయితే బాగుంటుందని విజయ్ అనుకున్నారు. అలాగే ఈ సినిమా ప్రివ్యూను మా బావగారు చూసి చాలా సంతోషపడ్డారు. నా కెరీర్‌కు ఒక మంచి చిత్రంగా ఉంటుందని కితాబిచ్చారు. ఆయన జడ్జిమెంట్‌ను నేను నమ్ముతా.

బాధేస్తుంది కానీ..

ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు ఒక విభాగాన్ని మాత్రమే కారణంగా చూపలేం. సినిమా అనేది అందరి సమష్టి కృషి. సుమారు ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా మనసా, వాచా, కర్మణా దానిపైనే దృష్టి పెట్టి చేస్తాం. ఎంతో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కానీ, రెండు గంటల్లో చూసి హిట్టో, ఫట్టో కొందరు ఈజీగా చెప్పేస్తారు. నా వరకు నేను 100శాతం కష్టపడతా. నా డైరెక్టర్లతో బాగా స్నేహం చేస్తా. అప్పుడే నాకనిపించిన తప్పులు, వాళ్లు చెప్పే సూచనలు త్వరగా ఒకరినొకరం అర్థం చేసుకోగలం.

మూడు సినిమాలు వరుసలో ఉన్నాయి..

ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్‌పై ఒక సినిమా చేస్తున్నా. అలాగే సురేష్‌ ప్రొడక్షన్స్‌పై హిందీ చిత్రం ‘గర్ల్‌ఫ్రెండ్‌’ విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలోనే రీమేక్‌ చేస్తున్నాం. శ్రీనివాస్‌ గవిరెడ్డితో చేస్తున్న చిత్రం కూడా చివరిదశలో ఉంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని