నా నిర్ణయాల వెనుక వీళ్లు ఉంటారు: ఎన్టీఆర్‌ - rajamouli and keeravani are god gifted family to me says ntr
close
Updated : 22/03/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా నిర్ణయాల వెనుక వీళ్లు ఉంటారు: ఎన్టీఆర్‌

‘తెల్లవారితే గురువారం’ ప్రిరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: ‘నాకు దేవుడిచ్చిన శక్తి అభిమానులైతే.. దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న కుటుంబం’ అని అన్నారు అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు. కీరవాణి తనయుడు శ్రీసింహ కథానాయకుడిగా తెరకెక్కిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా ప్రిరిలీజ్‌ వేడుకకు తారక్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మణికాంత్ జెల్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు. మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఆదివారం ఈ వేడుకను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘నాకు ఇరవయేళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జక్కన్న, కీరవాణి కుటుంబం. నా జీవితంలో తీసుకున్న ఎన్నో నిర్ణయాల వెనుక ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో వీళ్లు ఉంటారు. ఈ కుటుంబానికి నేనెప్పుడూ అతిథిని కాను. నేనూ వాళ్ల కుటుంబ సభ్యుడిగానే భావిస్తాను. ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. హీరో శ్రీసింహ, డైరెక్టర్‌ మణికాంత్‌, సంగీత దర్శకుడు కాల భైరవతో పాటు ఈ సినిమాకు పని చేసినవారందరికీ.. ఈ చిత్రం ఓ అద్భుతమైన విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ సక్సెస్‌ మీట్‌లో కలుద్దాం’ అని అన్నారు.

అంతకు ముందు రాజమౌళి మాట్లాడుతూ.. ‘మేము మామూలుగా చాలామంది నటులను చూస్తుంటాం. ఇది బాగుంది.. ఇది బాగాలేదు.. అని సులభంగా చెప్పేస్తుంటాం. కానీ మన ఇంట్లో పిల్లల విషయానికి వచ్చేసరికి టెన్షన్‌ ఉంటుంది. వాళ్లు కొంచెం బాగా చేసినా మురిసిపోతాం. కాల భైరవ గురించి టెన్షన్‌ లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నోడి (శ్రీసింహ) గురించే కాస్త భయం. ఆ భయం కూడా మీరు పోగొడతారని ఆశిస్తున్నా. డైరెక్టర్‌ మణికాంత్‌ మొదటి సినిమానే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’ అని ఆయన అన్నారు.

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని