ఐదు భాషల్లో ‘ఇక్షు’ - rajiv kanakala movie ikshu release in five languages
close
Published : 22/07/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదు భాషల్లో ‘ఇక్షు’

హైదరాబాద్‌: రామ్‌ అగ్నివేశ్, రాజీవ్‌ కనకాల, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రల్లో ఋషిక తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇక్షు’. హనుమంతురావు నాయుడు, గౌతమ్‌ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే చిత్ర ప్రోమో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఋషిక మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో తెరకెక్కించాం. లేడీ డైరెక్టర్‌ అని చూడకుండా ప్రతి ఒక్కరూ చాలా సహాయపడ్డారు. నాకీ అవకాశమిచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కథ బాగా కుదిరింది ఋషిక అనుకున్న దానికన్నా బాగా తీశారు. ఐదు భాషల్లో విడుదల చేయనున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. సంగీతం: వికాస్‌ బాడిస, ఛాయాగ్రహణం: నవీన్‌ తొడిగి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని