గట్టిగా ఏడ్చేసిన రకుల్‌.. ఎందుకో తెలుసా..! - rakul preet singh seen crying pics goes viral
close
Published : 25/07/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గట్టిగా ఏడ్చేసిన రకుల్‌.. ఎందుకో తెలుసా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌ చిట్కాలు చెప్తూ సినిమా అప్డేట్లు ఇస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అయితే.. ఎప్పుడు చూసినా చలాకీగా కనిపించే ఆమె ఒక్కసారిగా చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చేసింది. కంగారు పడకండి. ఆమె ఏడ్చిన మాట వాస్తవమే అయినా.. ఏడ్చింది మాత్రం నిజంగా కాదు. ఓ సినిమా డబ్బింగ్‌లో భాగంగా ఆమె ఏడ్చింది. దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రం ‘అటాక్‌’లో నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ అబ్రహం సరసన ఆమె జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సందడి చేయనుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పే పనుల్లో రకుల్‌ మునిగిపోయిందిప్పుడు. అందులో భాగంగానే ఓ ఏడుపు సన్నివేశానికి డబ్బింగ్‌ చేప్తున్న క్రమంలో తీసిన వీడియోను ఆమె అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం చేతి నిండా బాలీవుడ్‌ సినిమాలతో రకుల్‌ బిజీబిజీగా గడుపుతోంది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో మొత్తం అరడజనుకు పైగా సినిమాలకు ఆమె సంతకం చేసింది. తెలుగులోనూ క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించనుంది. దీంతో పాటు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇండియన్‌2’లోనూ రకుల్‌ సందడి చేయనుంది. మరోవైపు ‘మేడే’ అనే చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఆ సినిమాకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌దేవ్‌గణ్‌ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించనున్నారు. అందులో అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రకుల్‌ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రకుల్‌ నటించిన ‘అటాక్‌’ లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆగస్టు 13న ఆ సినిమా విడుదల కానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని