
మాస్ మహారాజ్‌కు మెగాపవర్‌స్టార్ ప్రశంస
హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘క్రాక్’లో రవితేజ నటన టాప్ లెవల్లో ఉందని ఆయన అన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రామ్‌చరణ్ తాజాగా ‘క్రాక్’ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు. సదరు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘క్రాక్’ చిత్రాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. నా అభిమాన హీరో మాస్ మహారాజ్ రవితేజ.. అదరగొట్టేశారు. ఆయన నటన టాప్ లెవల్లో ఉంది. శ్రుతిహాసన్ తన బెస్ట్ ఇచ్చారు. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం చిత్రాన్ని వేరే లెవల్‌కు తీసుకువెళ్లింది. గోపీచంద్ మలినేని.. అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రబృందం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అని చెర్రీ పేర్కొన్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంవహించిన ‘క్రాక్’ సినిమాలో రవితేజ.. పోతరాజు వీరశంకర్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. రవితేజ భార్యగా శ్రుతిహాసన్ సందడి చేశారు. బి.మధు నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా 9వ తేదీన విడుదలైన ‘క్రాక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
ఇవీ చదవండి
నా పాత్రని చూసుకుని నేనే భయపడ్డా
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్ఈసీ చర్యలు
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే