ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన రష్మిక..?
హైదరాబాద్: వరుస సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తున్నారు నటి రష్మిక. కన్నడలో మంచి విజయాన్ని సాధించిన ‘కిర్రాక్‌పార్టీ’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ సంపాదించుకుంటోన్న రష్మిక ఇటీవల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్దార్థ్ మల్హోత్ర సరసన ‘మిషన్ మజ్ను’లో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూట్లో గత కొన్నిరోజుల నుంచి ఆమె పాల్గొంటున్నారు. ‘మిషన్ మజ్ను’ విడుదల కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ చిత్రంలో నటించే బంపర్ ఆఫర్‌ను రష్మిక సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, తాజా సమాచారం ప్రకారం ఇటీవల రష్మిక ముంబయిలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వరుస షూటింగ్స్‌లో భాగంగా ఇటు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఉండాల్సి వస్తుందట. దీంతో, ఇంటి విషయంలో ప్రతిసారీ ఇబ్బందిపడకుండా ఉండేలా తాజాగా ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రష్మిక.. ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా తనకెంతో ఇష్టమైన కొన్ని వస్తువులను సైతం హైదరాబాద్‌లోని ఇంటి నుంచి ముంబయికు తీసుకువెళ్లారట ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ వార్తలపై ఆమె నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్