అనిల్‌ రావిపూడి చిత్రంలో సరికొత్తగా బాలయ్య? - ravipudi to give a stylish makeover to balakrishna
close
Published : 22/06/2021 15:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనిల్‌ రావిపూడి చిత్రంలో సరికొత్తగా బాలయ్య?

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ ఒకటి. ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ముచ్చటిస్తూ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మాస్‌, క్లాస్‌ కథ ఏదైనా బాలకృష్ణ తనదైన శైలిలో నటించగలరు. ఇక మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తీయడంలో అనిల్‌ తనకు తానే సాటి. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్‌ను ఎలా చూపించారో అందరికీ తెలిసిందే.

మరి బాలయ్యను ఎలా చూపిస్తారోనని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇంతకు ముందెన్నడూ చూడని స్టైలిష్‌ లుక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారట. అంతేకాదు, సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా ఎనర్జెటిక్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ యువ కథానాయకులతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’లో నటిస్తున్నారు. దీంతోపాటు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అటు అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌3’ని పూర్తిచేసే పనిలో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని