RGV: నాకు ఎవ్వరితో రిలేషన్‌ లేదు: ఆర్జీవీ   - rgv bold interview with ariyana
close
Updated : 19/06/2021 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RGV: నాకు ఎవ్వరితో రిలేషన్‌ లేదు: ఆర్జీవీ  

డైరెక్టర్‌తో అరియానా బోల్డ్‌ ఇంటర్వ్యూ

హైదరాబాద్‌: తనకి ఎవ్వరితో రిలేషన్‌ లేదని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి ‘శివ’, ‘రంగీలా’ వంటి మంచి బ్లాక్‌బస్టర్‌ విజయాలను అందించిన ఆయన ఇటీవల ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ‘స్పార్క్’ పేరుతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి.. అన్నిరకాల కంటెంట్‌తో ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తున్నారు. కాగా, కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న ఆర్జీవీని తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ అరియానా ఇంటర్వ్యూ చేశారు. జిమ్‌లో జరిగిన ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్‌ వీడియోని ఆర్జీవీ నెటిజన్లతో పంచుకున్నారు. అందులోని కొన్ని విశేషాలు..

మీరు బిగ్‌బాస్‌ చూడరు. అలాంటిది నాకోసం బిగ్‌బాస్‌ చూసి ట్వీట్‌ చేశారు? మీకూ నాకూ మధ్య ఏదో ఉందని చాలామంది అనుకుంటున్నారు?

ఆర్జీవీ: నేను బిగ్‌బాస్‌ను తొలిసారి సన్నీలియోని వచ్చినప్పుడు చూశా. కానీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ బిగ్‌బాస్‌ చూశా.

మీరు నాకు ఒక కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద షోలో పాల్గొన్నా. ఈ సక్సెస్‌కు థ్యాంక్యూ.

ఆర్జీవీ: నేను నా నోటికి వచ్చింది వాగుతూ ఉంటా. ఆ సమయంలో నాకు అనిపించింది చెప్పా. వేరే వాళ్లైతే దాన్ని ఇంకోరకంగా తీసుకునేవాళ్లు. ఆ సమయంలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి, వాళ్లు నీకు అవకాశం ఇచ్చారు. కానీ, నా వల్ల నీకు అవకాశం రాలేదనుకుంటా. నువ్వు నాకు థ్యాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు.

నా తర్వాత చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఎవరికీ మీరెందుకు కాంప్లిమెంట్‌ ఇవ్వలేదు.

ఆర్జీవీ: నాకు ఫీలింగ్‌ లేకుండా ఎలా ఇస్తాను. నీ అందం చూసి అలా అలా అన్నా.

మీ నుంచి ప్రశంసలు అందుకోవడానికి చాలామంది అమ్మాయిలు తాపత్రయపడుతుంటారు. అప్పుడు మీరు కృష్ణుడిలా ఫీలవుతారా?

ఆర్జీవీ: అలా ఏమీ లేదు. నేనెప్పుడూ అలా అనుకోలేదు.

మనిద్దరి మధ్య డెస్టినీ అనేది ఉందంటారా?

ఆర్జీవీ: డెస్టినీ అనేది ఏదీ ఉండదు. మన జీవితంలో మన కంట్రోల్‌ లేకుండా ఏదో జరగడమే డెస్టినీ. అది జరిగినప్పుడు అవకాశంగా తీసుకోవడం డెస్టినీ. ఆ ఇంటర్వ్యూలో మనిద్దరం కలుస్తామని తెలియదు. కానీ, కలిశాం. నేను అలా అంటానని నాకూ తెలియదు. అలాగే నీకూ తెలియదు. ఆ సమయంలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నీకు అవకాశం తెచ్చి పెట్టింది.

మీరు అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి వర్కవుట్‌ చేస్తుంటారా?

ఆర్జీవీ: నో! అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి సిక్స్‌ప్యాక్‌ చేయాలన్న ఆలోచన అస్సలు లేదు. సూపర్‌స్టార్‌లతో నేను పోటీ పడలేను. నాకున్న టాలెంట్‌ మాటలతో గారడీ చేయటం. ఎదుటివాళ్లకు నాకున్నంత బుర్రలేదు కాబట్టి, వాళ్లను పడేయగలుగుతున్నా. వీలైనంత ట్రిమ్‌గా ఉండాలన్న ఆలోచనతోనే నేను వ్యాయామం చేస్తా!

అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే సమాజంలో వింతగా చూస్తారు! కామెంట్లు చేస్తారు. దీనిపై మీ రియాక్షన్‌?

ఆర్జీవీ: ఎవరైతే ఇలా మాట్లాడతారో వాళ్లు అంత అందంగా లేరని అర్థం. ఒక మనిషిని కించపరడం తప్ప వాళ్లకు ఏమీ తెలియదు. దేవుడు ప్రతి ఒక్కళ్లకీ ఏదో ఒక టాలెంట్‌ ఇస్తాడు. అలా అమ్మాయిలకు అందం అనేది ఆస్తి. ధనవంతుడికి డబ్బు ఎంత పవర్‌ ఇస్తుందో.. అమ్మాయికి అందం కూడా అంతే పవర్‌ ఇస్తుంది. అది తెలుసుకున్నప్పుడు మీరు గర్వంగా ఫీలవుతారు

‘డేంజర్‌’లో లెస్బియన్స్‌ గురించి చూపించారు?

ఆర్జీవీ: పురుషులందరికీ లెస్బియన్‌ అంటే చాలా ఇష్టమట. అమ్మాయిలంటే ఇష్టమున్న అబ్బాయిలు.. అబ్బాయిలంటే ఇష్టమున్న అమ్మాయిలు.. అమ్మాయిలే ఇష్టమున్న అమ్మాయిలంటే నాకు ఇష్టం. అబ్బాయిలంటే ఇష్టమున్న అబ్బాయిలు నాకు ఇష్టం లేదు.

ఎవరితోనైనా ఎంతకాలం రిలేషన్‌లో ఉంటారు?

ఆర్జీవీ: పాతకాలంలో కొన్ని సంవత్సరాలు ఉండేవాడిని. ఆ తర్వాత ఏడాదికి, నెలలకు, ఇప్పుడు రోజులకు వచ్చింది. తర్వాత గంటల్లోకి వచ్చింది. ఒక వ్యక్తితో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయినప్పుడు రిలేషన్‌షిప్‌ పెరుగుతుంది. దాంతో తలనొప్పులు మొదలవుతాయి. అమ్మాయిలకు ఆ తలనొప్పులు లేకుండా ఉండేందుకు రిలేషన్‌షిప్‌లో ఉండను.

నాలా చాలామంది అమ్మాయిలు ఒకబ్బాయిని సర్వస్వం, ప్రపంచం అనుకుంటారు. అలాంటి వాళ్లకు మీరేం చెబుతారు?

ఆర్జీవీ: ఐదేళ్ల తర్వాత వచ్చి ‘ఆర్జీవీగారూ.. మీ మాట వినలేదు. సారీ నా ఖర్మ’ అని చెప్పకపోతే నా పేరు మార్చుకుంటా.(వెంటనే అరియానా అందుకుని.. ఆ రోజు రాకూడదని అనుకుంటున్నా)  కచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఇది బ్రహ్మంగారి జోస్యం కాదు.. ఆర్జీవీ జోస్యం.

మూవీస్‌.. ట్విటర్‌.. వోడ్కా.. అమ్మాయిలు.. వీటిలో ఒకదానిని ఎంచుకోమంటే..?

ఆర్జీవీ: అమ్మాయిలు.

రియాల్టీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది మన గురించి తప్పుగా అనుకుంటున్నారు.. మీతో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్నారు?

ఆర్జీవీ: ఒక అబ్బాయి, అమ్మాయి మంచి స్నేహితులుగా ఉంటే కొంతమంది చూడలేరు. అలాంటి వాళ్లే ఇలాంటివి క్రియేట్‌ చేస్తారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి సోషల్‌మీడియాలో ఇలాంటివి సృష్టిస్తారు. అలాంటి వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు

మీరు ఈ మధ్యకాలంలో నటి అప్సరా రాణీని ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు. ఇటీవల మదర్స్‌ డే సమయంలోనూ వాళ్లమ్మగారిని పొగుడుతూ ట్వీట్‌ చేశారు. మీరు అప్సరతో రిలేషన్‌లో ఉన్నారా?

ఆర్జీవీ: నాకు ఏవిధమైన రిలేషన్‌షిప్‌ లేదు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని