రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు - rrr and maidaan clash boney kapoor accuses ss rajamouli of bullying
close
Updated : 13/02/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు

దర్శకధీరుడిపై  మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన బోనీకపూర్‌

ముంబయి: దర్శకధీరుడు రాజమౌళిపై ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మైదాన్‌’ విడుదల తేదీలపై గత కొన్నిరోజుల నుంచి కోల్డ్‌వార్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బోనీకపూర్‌ మరోసారి వివాదంపై నోరు విప్పారు. ఒకనెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన చిత్రాలను విడుదల చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. నేను నిర్మాతగా వ్యవహరిస్తోన్న ‘మైదాన్‌’లో అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. అయితే కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. సినిమా కోసం మేము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టాం. ఈ ఏడాదిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సమయంలోనే అక్టోబర్‌ 15న ‘మైదాన్‌’ విడుదల చేస్తామని ప్రకటించాం. మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు రాజమౌళి, ఇతర చిత్రబృందం తెలిపింది. ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్ట్‌లు కేవలం రెండు రోజుల తేడాతో విడుదల కావడం దురదృష్టకరం. ఇది అనైతికమైన చర్య’

‘విడుదల తేదీల విషయమై ఇటీవల నేను రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడాను. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన నాతో చెప్పారు. కానీ, ఆయన మాటల్ని నేను నమ్మాలనుకోవడం లేదు. నాకు తెలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల గురించి అజయ్‌కు కూడా ముందుగా సమాచారం ఇచ్చారనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి నేను ఇలాంటి చర్య ఊహించలేదు’ అని బోనీకపూర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చదవండి

RRR రిలీజ్‌.. ఇది అన్యాయం: బోనీకపూర్‌

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని