వైష్ణవ్‌.. నీ భయం నాకు తెలుసురా - saidaram tej emotional letter to vaishnav
close
Updated : 12/02/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైష్ణవ్‌.. నీ భయం నాకు తెలుసురా

ఆ విషయంలో నేను నీకు ప్రామిస్‌ చేయలేను: సాయిధరమ్‌ తేజ్‌

హైదరాబాద్‌: నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తన సోదరుడిని ఉద్దేశిస్తూ సాయిధరమ్‌ తేజ్‌ భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. కెరీర్‌కు సంబంధించి ఓ విషయంలో తాను ఎలాంటి ప్రామిస్‌ చేయలేనని పేర్కొన్నారు.

‘‘నువ్వు కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవ్‌.. నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉందిరా!! నిన్ననే నిన్ను చిన్నపిల్లాడిగా చేతుల్లోకి తీసుకున్నట్లు ఉంది. అప్పుడే నువ్వు ఎదిగిపోయావు.. వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యావు. నువ్వు కూడా ఎంతో సంతోషంగా, భయంగా ఉన్నావని నాకు తెలుసు! నిన్ను చూస్తుంటే.. నా మొదటి చిత్రం విడుదలైనప్పుడు నేను ఏ విధంగా కంగారుపడ్డానో ఆరోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇండస్ట్రీలో నీ కెరీర్‌ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇప్పటి నుంచి నీ ఈ ప్రయాణం ఎలాంటి కష్టాలు లేకుండా సులువుగానే సాగుతుందని నేను మాట ఇవ్వలేను. కానీ, నీ కష్టానికి తగిన ప్రేమాభిమానాలను ప్రేక్షకులు నీకు అందిస్తారు. నీతోపాటు మా అందరికీ ఈ రోజు ఎంతో విశేషమైనది. ‘ఉప్పెన’ నీకు మంచి విజయాన్ని అందించాలని ఆశిస్తున్నా! వెండితెరపై నిన్ను చూడడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’’ అని సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు.

ఇవీ చదవండి

జీవితాల్ని చూపించే.. ఉప్పెన - పవన్‌

ఆయన లేకపోతే ‘ఉప్పెన’ ఒంటరయ్యేది

నా నటన చూసి ఏడ్చేశారు

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని