close
Published : 25/01/2021 18:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదే అసలైన ‘రిపబ్లిక్‌’: సాయిధరమ్‌తేజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఇచ్చిన విజయాన్ని ఆస్వాదిస్తూనే.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌. ‘ప్రస్థానం’ వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ దేవకట్టా దర్శకత్వంలో సాయితేజ్‌ తన తర్వాతి సినిమా చేయబోతున్నారు. తాజాగా సినిమా టైటిల్‌ను ‘రిపబ్లిక్‌’ అని ప్రకటించారు. ‘నా తర్వాతి సినిమా ‘రిపబ్లిక్‌’. నాకెంతో శక్తినిచ్చే ప్రాజెక్టు ఇది. దేవకట్ట గారి దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా భావిస్తున్నాను’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

ఆ పోస్టర్‌లో ‘ప్రజలెన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులను ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వమవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్‌’ అంటూ రిపబ్లిక్‌కు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, కీలక పాత్రల్లో నటించనున్నారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి..

కాజల్‌ లైవ్‌ టెలికాస్ట్‌ ఎప్పుడంటే..



Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని