close
కొత్త సినిమాలు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘సలార్‌’ ముహూర్తం ఖరారు..!

అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం

హైదరాబాద్‌: ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘సలార్‌’ ముహూర్తం ఖరారు అయ్యింది. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని రేపు ఉదయం ‘సలార్‌’ పనులను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కనున్న సలార్‌లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పనిచేయనున్న ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధేశ్యామ్‌’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌.. ‘కేజీఎఫ్‌-2’ నిర్మాణాంతర పనులు చూసుకుంటున్నారు.

ఇదీ చదవండి

భారీ బడ్జెట్‌తో ‘మణికర్ణిక’ సీక్వెల్‌

 

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు