2022 దీపావళికి ‘భాయీజాన్‌’ - salman khan bhaijaan to release on diwali 2022
close
Published : 29/07/2021 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2022 దీపావళికి ‘భాయీజాన్‌’

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో ఫర్హాద్‌ సామ్‌జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కభీ ఈద్‌ కభీ దివాలీ’. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పేరుని ‘భాయీజాన్‌’గా మార్చే ఆలోచనలో చిత్రబృందం ఉంది. కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2022 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పనిలో చిత్రబృందం ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాని వచ్చే ఏడాది దీపావళికి  విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. వినోదంతో పాటు కుటుంబ అనుబంధాల కలబోతగా ఈ చిత్రం ఉండనుంది’’అని చిత్రవర్గాలు చెప్పాయి. సల్మాన్‌ ‘టైగర్‌ 3’ చిత్రీకరణను పూర్తి చేయగానే నవంబరులో ఈ ‘భాయీజాన్‌’ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఈలోగా ఫర్హాద్‌ అక్షయ్‌కుమార్‌ ‘బచ్చన్‌పాండే’ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని