మళ్లీ వస్తాడట చుల్‌బుల్‌! - salmankhan hints about dabang 4
close
Published : 23/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ వస్తాడట చుల్‌బుల్‌!

ముంబయి: పోలీస్‌ అధికారి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ఖాన్‌ వెండితెరపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘దబాంగ్‌’ సిరీస్‌లో ఇప్పటివరకూ మూడు చిత్రాలొచ్చాయి. తొలి రెండు చిత్రాలు భారీ విజయం సాధించాయి. ‘దబాంగ్‌ 3’కు మిశ్రమ స్పందన లభించింది. ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్‌ ఉన్న చుల్‌బుల్‌ పాండేను మళ్లీ తెరపై చూసే అవకాశం సల్మాన్‌ అభిమానులకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘దబాంగ్‌ 4’ కచ్చితంగా ఉంటుందనే మాట సల్మాన్‌ మాటలను బట్టి అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ఓ టాక్‌ షోకి సల్మాన్‌ హాజరయ్యారు. అందులో వ్యాఖ్యాతగా వ్యవహరించిన అర్భాజ్‌ఖాన్‌ ‘దబాంగ్‌’ 1, 2, 3, 4లలో మీకు ఏది ఇష్టం? అని సల్మాన్‌ అడిగితే నాలుగోదే అని సమాధానం చెప్పారు. అంటే మీరు ‘దబాంగ్‌ 4’ని ఓకే చేసినట్టే అని అర్భాజ్‌ అంటే సల్మాన్‌ ఓకే అన్నట్లు నవ్వారట. దీంతో మొత్తానికి ‘దబాంగ్‌ 4’తో మరోసారి చుల్‌బుల్‌ పాండే సందడి చేయడం ఖాయంగా అనిపిస్తోంది అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని