సమంత క్షమాపణలు చెప్పాలి - samantha should apologize unconditionally for taking up the role says manobala
close
Updated : 09/06/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంత క్షమాపణలు చెప్పాలి

సీనియర్‌ నటుడు మనోబాల

చెన్నై: అగ్రకథానాయిక సమంత అక్కినేని కోలీవుడ్‌ ఆడియన్స్‌కు క్షమాపణలు చెప్పాలని సీనియర్‌ నటుడు మనోబాల డిమాండ్‌ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ వెబ్‌సిరీస్‌ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను కించపరిచేలా ఉందని పేర్కొంటూ ఇప్పటికే పలువురు నుంచి విమర్శలు ఎదురైన విషయం విదితమే. తాజాగా ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ వివాదం గురించి నటుడు మనోబాల స్పందించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందిస్తూ.. పలు కామెంట్లు చేశారు.

‘‘ది ఫ్యామిలీ మేన్‌-2’ సిరీస్‌ తమిళ ప్రజల మనోభావాలను ఇబ్బందిపెట్టేలా ఉంది. ఇలాంటి సిరీస్‌లో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పితీరాలి. రాజీ పాత్ర విషయంలో కూడా చిత్రబృందం సామ్‌ను మోసం చేసింది. ఒక పోరాటయోధురాలిగా ఆమెకు ఈ పాత్ర గురించి వర్ణించినప్పటికీ.. ఈలం పోరాటం క్షీణత తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారు. ఇలాంటి కథను ఒప్పుకొనే ముందు సమంత ఇంకొంత ఆలోచించాల్సింది. సామ్‌ క్షమాపణలు చెప్పినా సరే.. చిత్రబృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకూ సిరీస్‌కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం’ అని మనోబాల తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని