Sameera Reddy: అది నా ఇష్టం.. దానిపై చర్చించాల్సిన అవసరం ఏముంది? - sameera reddys dad asked why she isnt covering her white hair she had the best reply
close
Published : 16/09/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sameera Reddy: అది నా ఇష్టం.. దానిపై చర్చించాల్సిన అవసరం ఏముంది?

దిల్లీ: నటి సమీరా రెడ్డి తరచూ నెటిజన్లను అలరిస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన తెల్ల జుట్టు గురించి ఆమె తండ్రితో సంభాషించిన విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆమె తెల్ల జుట్టుతో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అయింది.

‘తెల్ల వెంట్రుకలను ఎందుకు కవర్‌ చేసుకోవట్లేదని అందరూ అడుగుతుంటే ఏదోలా అనిపిస్తోంది’ అని ఆమె తండ్రి అడిగాడని సమీరా చెప్పుకొచ్చారు. దానికి సమాధానంగా ‘‘నా లుక్‌ గురించి ఎవరు బాధపడనక్కర్లేదు. నేను ప్రతి రెండు వారాలకొకసారి జుట్టుకు కలర్‌ వేసుకునేదాన్ని. అప్పుడు ఎవరూ ఆ తెల్లటి గీతను గమనించలేదు. ఇప్పుడు కలర్‌ వేసుకునేందుకు సమయాన్ని వెచ్చించట్లేదు. నాకు నచ్చినప్పుడు, ఇష్టం వచ్చినపుడు వేసుకుంటాను. దీనిపై చర్చిస్తున్న వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పాత ఆలోచనలు విచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే మనలో మార్పు మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం అనేది మనలో సహజంగానే ఉంటే ఏ ముసుగు దాన్ని కప్పి ఉంచలేదు. అది మా నాన్నకు అర్థమైంది. ఆయన ఆందోళనను నేను అర్థం చేసుకున్నాను. జీవితంలో చిన్న మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మనలో శాంతిని గుర్తిస్తాం. ఆ చిన్న మార్పులే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి’’ అని సమీరా పేర్కొన్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని