Cinema News: కొత్తగా మరొకటి? - santosh shoban to act in a tamil remake
close
Published : 19/06/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: కొత్తగా మరొకటి?

హైదరాబాద్‌: ‘ఏక్‌ మినీ కథ’ చిత్రంతో ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు పసందైన వినోదం అందించారు కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ఇప్పుడాయన ‘ప్రేమ్‌ కుమార్‌’ అనే సినిమాతో పాటు.. దర్శకుడు మారుతితోనూ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడివి సెట్స్‌పై ఉండగానే.. సంతోష్‌ ఓ రీమేక్‌ కథలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం అందుతోంది. అదే తమిళ హిట్‌ చిత్రం ‘8 తూటక్కల్‌’. ఓ విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. మాతృకను తెరకెక్కించిన శ్రీ గణేష్‌.. తెలుగు వెర్షన్‌కీ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయనే తెలుగు రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే సంతోష్‌తో కథా చర్చలు జరిపారని.. త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం వినిపిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని