saroj khan: నా తల్లి పాత్ర ఆమె పోషిస్తే బాగుంటుంది - saroj khans daughter wants madhuri dixit as narrator of her mothers biopic
close
Published : 02/08/2021 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

saroj khan: నా తల్లి పాత్ర ఆమె పోషిస్తే బాగుంటుంది

సరోజ్‌ఖాన్‌ బయోపిక్‌పై ఆమె కుమార్తె వ్యాఖ్య

ముంబయి: బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ ఒకరు.  ఖల్‌నాయక్‌, దేవ్‌దాస్‌, ఫనా తదితర వందలాది చిత్రాలకు నృత్య దర్శకురాలిగా పని చేసిన ఆమె.. గతేడాది జులైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బయోపిక్‌ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె మొదటి వర్ధంతి సందర్భంగా.. టీ సీరిస్‌ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత భూషణ్‌కుమార్‌ ప్రకటించారు.  ఈ నేపథ్యంలో సరోజ్‌ఖాన్‌ పాత్రను ఎవరు పోషిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఆమె కుమార్తె సుకైనా నాగ్‌పాల్‌ మాట్లాడుతూ.. నా తల్లి పాత్రలో ప్రముఖ నటీ మాధురి దీక్షిత్‌ అయితే బాగుంటుందని మనసులో మాట చెప్పారు. తన తల్లితో ఆమెకు మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఈ చిత్రానికి దర్శకుడిని ఖరారు చేయాల్సి ఉంది.  దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆయన గతంలో ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. సరోజ్‌ఖాన్‌ చివరిగా కళంక్‌ సినిమాకు నృత్య దర్శకురాలిగా వ్యవహరించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని