
కీ రోల్ పోషించనున్న నటుడు
హైదరాబాద్: ‘బ్లఫ్ మాస్టర్’తో తనలోని నటుడిని సినీ ప్రియులకు పరిచయం చేసి విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్. అటు సినిమాలతోపాటు ఇటు వరుస వెబ్ సిరీస్‌లలో హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా నటిస్తూ అభిమానులను అలరిస్తున్న ఈ టాలీవుడ్ హీరో త్వరలో మెగాస్టార్‌తో స్ర్కీన్ పంచుకోనున్నట్లు తెలుస్తోంది.
మలయాళీ చిత్రం ‘లూసిఫర్’కు రీమేక్‌గా త్వరలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం సత్యదేవ్‌తో సంప్రదింపులు జరపగా.. మెగాస్టార్ చిత్రంలో నటించడానికి ఈ టాలీవుడ్ హీరో అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మలయాళంలో టోవినో థామస్ లేదా పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతేడాది చివర్లో మెగాస్టార్-సత్యదేవ్ కలిసి దిగిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రామ్‌చరణ్ నటించవచ్చని కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవీ చదవండి
వైరల్‌గా మారిన సెలబ్రిటీ జంటల ఫొటోలు
సామజవరగమనా.. తమన్ జోరు ఆపతరమా
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి